తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ముగిసిన మాఫియా రాడ్యం రవికిషన్ వెల్లడి

రిపోర్టర్: రాము స్థలం: గోరఖ్‌పూర్

గోరఖ్‌పూర్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన యూపీ ట్రాన్స్‌ఫర్మేషన్ డైలాగ్స్ సదస్సులో ఎంపీ రవికిషన్ కీలక ప్రసంగం చేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ వార్‌లు, మాఫియా పాలన పూర్తిగా అంతమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన శాంతిభద్రతలు, ఆధునిక రవాణా సౌకర్యాలతో ఈ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలంగా మారిందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని రవికిషన్ తెలిపారు.