కొచ్చిలో ఘనంగా సాగిన బ్రెజిల్ లెజెండ్స్ ప్రదర్శన మ్యాచ్
రిపోర్టర్: గోపి
స్థలం: కొచ్చి
కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బ్రెజిల్ లెజెండ్స్, ఇండియన్ ఆల్ స్టార్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ప్రదర్శన మ్యాచ్లో బ్రెజిల్ జట్టు 4-3 తేడాతో విజయం సాధించింది. రోనాల్డినో నేతృత్వంలోని బ్రెజిల్ జట్టు తరఫున ఫెర్నాండిన్హో హ్యాట్రిక్ సాధించగా, రోనాల్డినో పెనాల్టీ గోల్ చేశారు. ఇండియన్ ఆల్ స్టార్స్ జట్టు తరఫున సీకే వినీత్ రెండు గోల్స్, అషిమ్ బిశ్వాస్ ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్ను తిలకించేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ఫుట్బాల్ అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు.