బీమా పాలసీదారులకు గుడ్ న్యూస్: ఒకే చోట అన్ని వివరాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ఇన్సూరెన్స్ పాలసీ వివరాల కోసం ఇకపై వెతకాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ (PIR) పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. దీని ద్వారా పాలసీ సమాచారం, క్లెయిమ్ వివరాలు ఒకే చోట లభిస్తాయి. అలాగే, ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌ను 3 గంటల్లోపు పరిష్కరించేలా కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. దీనివల్ల పాలసీదారులకు పారదర్శకతతో పాటు వేగవంతమైన సేవలు అందుతాయి.