యూపీ నీట్ యూజీ రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లో నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17న మెరిట్ జాబితా విడుదలవుతుంది. సెప్టెంబర్ 21న సీట్ల కేటాయింపు ఫలితాలు ప్రకటిస్తారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్థులు విధిగా ప్రవేశాలు పొందాలని అధికారులు స్పష్టం చేశారు.