అమెరికా ఇరాన్ మధ్య దౌత్య చర్చలు: అణు ఒప్పందంపై తాజా విధివిధానాలు వెల్లడి

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొత్త దౌత్య మార్గాలు అన్వేషిస్తున్నట్లు అల్ అరబియా మీడియా వెల్లడించింది. ఇరాన్ అణు సంపత్తిని మూడో దేశానికి తరలించడం లేదా దాని స్థాయిని తగ్గించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దోహా వేదికగా ప్రత్యక్ష చర్చలు నిర్వహించాలని, చైనాను గ్యారంటర్గా ఉంచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆసక్తి నెలకొంది.