కొత్త పెన్షన్ల పేరిట అధికారుల అక్రమ వసూళ్లు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Andhra Pradesh

రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు పేరిట దరఖాస్తుదారుల నుంచి కొందరు అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. రకరకాల కారణాలు చెప్పి పెన్షన్ రాదని భయపెట్టి ఐదు వేల నుంచి పది వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. అర్హులైన అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.