హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: Greater Noida
ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ హోదాకు తగినట్లుగా వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హితవు పలికారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. కొందరి స్వభావం ఎప్పుడూ రాజ్యాంగ పదవుల హుందాతనాన్ని కాపాడటంలో విఫలమవ్వడమేనని యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.