యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక్కరోజే ముప్పైతొమ్మిది లక్షల భారీ ఆదాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా భారీగా పెరిగింది. వివిధ విభాగాల ద్వారా మొత్తం ముפై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల పన్నెండు రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.