చెన్నైలో మైలాపూర్ నిధి సంస్థ బాధితుల నిరసన ప్రదర్శన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: చెన్నై
చెన్నైలో మైలాపూర్ హిందూ పర్మినెంట్ ఫండ్ నిధిలో సుమారు ఏడు వందల కోట్ల రూపాయల మేర మోసం జరిగిందంటూ వందలాది మంది సీనియర్ సిటిజన్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. జీవితకాల కష్టార్జితాన్ని కోల్పోయామని, ప్రభుత్వ జోక్యం చేసుకుని తక్షణ విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బీజేపీ మిత్రపక్ష నేత దేవనాథన్ యాదవ్ అరెస్టయ్యారు. ఆరు వేల మందికి పైగా డిపాజిటర్లు నష్టపోయారని, వెంటనే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తమ డబ్బును ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.