వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూతురు పెళ్లి పత్రిక ఉంచిన వైఎస్ షర్మిల

రిపోర్టర్: రమేష్ స్థలం: వైఎస్ఆర్ జిల్లా

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24న అంజలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం జరగనుండగా, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి తొలి పెళ్లి పత్రికను ఉంచి మహానేత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయమ్మతో పాటు అనిల్ దంపతులు పాల్గొన్నారు.