'చలో పరేడ్ గ్రౌండ్స్': తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఈటల రాజేందర్ పిలుపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: సికింద్రాబాద్

సెప్టెంబర్ 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ చారిత్రాత్మక వేడుకల్లో సమాజంలోని ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివచ్చి భాగస్వాములు కావాలని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఉదయం 8:00 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలను ప్రజలంతా కలిసి గర్వంగా జరుపుకోవాలని ఆయన కోరారు.