తమిళనాడులో అరుదైన దృశ్యం: సీఎం విజయ్ భుజంపై చేయి వేసిన వృద్ధురాలు
రిపోర్టర్: శివ
స్థలం: చెన్నై
స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ఓ వృద్ధురాలు ఎలాంటి సంకోచం లేకుండా సీఎం విజయ్ భుజంపై చేయి వేసి ఆప్యాయంగా ఫొటోకు పోజులిచ్చారని అధికారులు తెలిపారు. ఆమె చూపిన ఆత్మీయతకు ముఖ్యమంత్రి విజయ్ కూడా అంతే ప్రేమగా స్పందించి ముచ్చటించడంతో ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.