'ఓయో రూములే అడ్డాగా గుట్టుగా వ్యాపారం': హైదరాబాద్‌లో గంజాయి గుట్టు రట్టు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓయో హోటల్ కేంద్రంగా సాగుతున్న భారీ గంజాయి గుట్టును ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. అస్సాంకు చెందిన ధీరజ్ దాస్, రబాలి అనే ఇద్దరు నిందితులు ఓయో రూమ్‌ను అద్దెకు తీసుకుని గంజాయిని చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి, రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.