తమిళనాడులో నాలుగు వేల ఏళ్ల నాటి రాక్ పెయింటింగ్స్ గుర్తింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని తేనీ జిల్లా కడమలైకుండు ప్రాంతంలో నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన రాక్ పెయింటింగ్స్, గుహ నివాసాలు బయటపడ్డాయి. సంగిలికరాడు కొండల వద్ద ఉపాధ్యాయుడు సెల్వం వీటిని గుర్తించారు. ఇనుమును కరిగించే పరికరాలు, టెర్రకోట పైపులు కూడా లభ్యమయ్యాయి. కీళాడి నాగరికత కంటే ఇవి పురాతనమైనవి కావచ్చని నిపుణులు భావిస్తుండగా, ప్రభుత్వం ఈ ప్రాంతంలో సమగ్ర తవ్వకాలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.