రంగారెడ్డి జిల్లాలో ఏసీబీకి చిక్కిన సబ్ ట్రెజరీ అధికారులు

రిపోర్టర్: రాము స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరరీ కార్యాలయంలో సస్పెన్షన్ కాలపు జీతం, పెన్షన్ బకాయిల బిల్లుల కోసం రూ.2.50 లక్షలు లంచం డిమాండ్ చేసిన సబ్ ట్రెజరీ ఆఫీసర్ మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్ కావలి అనురాధ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి వడ్డె జంగయ్య ద్వారా మొదటి విడతగా రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని నాంపల్లి జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.