రాహుల్ గాంధీకి ఊరట నిరాకరించిన బాంబే హైకోర్టు
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహారాష్ట్ర
ప్రధాని మోదీపై రఫేల్ ఒప్పందం వివాదంలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహేశ్ శ్రీశ్రీమల్ దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ ప్రాథమిక దశలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.