వరంగల్ ఎయిర్ పోర్టు పేరుపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రతిపాదనలు

రిపోర్టర్: సునీల్ స్థలం: వరంగల్

తెలంగాణలోని చారిత్రక నగరమైన వరంగల్‌లో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి రుద్రమ లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరు పెట్టాలని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. సీఎం పిలుపు మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ చారిత్రక ప్రాధాన్యత గల పేర్లను ప్రతిపాదించారు. దీనిపై సీఎం రెంవత్ రెడ్డి స్పందిస్తూ దట్స్ ది స్పిరిట్ అంటూ ప్రశంసించగా, తన రాబోయే చిత్రంలోనూ ఇదే డైలాగ్ ఉందని సందీప్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.