క్రీడా రంగ అభివృద్ధికి భారీ ఊరట: ఖేలో ఇండియా స్కీమ్కు కేంద్రం ఆమోదం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,856.67 కోట్ల భారీ బడ్జెట్తో ఖేలో ఇండియా స్పోర్ట్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకానికి ఆమోదం తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2033-34 వరకు అమలు కానున్న ఈ సరికొత్త పథకం ద్వారా దేశీయ క్రీడా పరికరాల తయారీ రంగానికి విశేషమైన ప్రోత్సాహం లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.