లక్డీకాపూల్ లో కొత్త వన్-వే అమలు: క్షేత్రస్థాయిలో సీపీ సజ్జనర్ పరిశీలన

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

హైదరాబాద్ లోని నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ పరిసరాల్ లో ట్రాఫిక్ను మరింత సులభతరం చేసేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని Hyderabad City Police వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో కొత్తగా వన్-వే అమలుపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంటూ, స్వయంగా బైక్ పై వెళ్లి క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ సాధ్యాసాధ్యాలను సీపీ సజ్జనర్ పరిశీలించినట్లు ట్వీట్ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.