భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు ఘన విజయం: జైశంకర్
రిపోర్టర్: మహేష్
స్థలం: India
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్లో జరిగిన బ్రిక్స్ సదస్సు దౌత్యపరంగా కీలక విజయం సాధించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో విభేదాలున్న దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భారత్ విజయవంతమైందని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం, ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం వంటి కీలక అంశాలపై సదస్సులో స్పష్టమైన ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన స్పష్టం చేశారు.