ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసే వాము ఆకు అద్భుత ప్రయోజనాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
ఆయుర్వేద నిపుణుల ప్రకారం వాము ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు థైమోల్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ ఇబ్బందిలను నివారించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.