అనంతపురం దారుణం: విద్యార్థినిపై దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆవేదన

రిపోర్టర్: హరి స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై జరిగిన అటాక్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉన్మాద దాడికి పాల్పడిన నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని, అతడికి చట్టపరంగా కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు.