పాలన గాలికొదిలేసి రోజుకో డైవర్షన్ డ్రామాలు ఆడుతున్న రేవంత్ సర్కార్
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ప్రజల సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో డైవర్షన్ డ్రామా ఆడుతోందని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్‌కు బస్సు యాత్ర పేరుతో కొత్త నాటకాలకు తెరలేపారని ఆరోపించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే, పాలనను పట్టించుకోకుండా వందలాది మంది పోలీసులతో మంత్రులు, ఎమ్మెల్యేలు విహారయాత్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.