మృతుడి కుటుంబానికి రూ. 83 వేల సాయమందించి మానవత్వం చాటిన పూర్వ విద్యార్థులు

రిపోర్టర్: Madhu Bngr స్థలం: ఆత్మకూరు(ఎం)

ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మల్లేష్ కుటుంబానికి పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.83 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నగేష్, ఇంద్రారెడ్డి, శ్రీను, పురుషోత్తం, శంకర్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.