భారీ వర్షాల వేళ వైద్యుల సెలవులు రద్దు చేస్తూ డీఎంహెచ్వో ఆదేశం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

భారీ వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని DM&HO డాక్టర్ డి. రామారావు ఆదేశించారు. వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్, ప్రథమ చికిత్స కిట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అత్యవసర వైద్య సహాయం కోసం 108, 104 సేవలను సంప్రదించాలని కోరారు.