ఉద్యోగులకు దసరా కానుకగా రెండు డీఏలు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండగ కానుకగా రెండు కరవు భత్యాలు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయంలో జరిగిన రాత్రి చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ సంజయ్ జాజు సానుకూల నిర్ణయం వెల్లడించడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.