ఎకరం భూమి కోసం ఐటీసీ గేటు వద్ద బాధితుడి ఆందోళన

రిపోర్టర్: విజయ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం కోయగూడెంలో 29 ఏళ్లుగా ఎకరం అసైన్డ్ భూమి కోసం బాదావత్ నాగులు కుటుంబం పోరాటం చేస్తోంది. ఐటీసీ పరిశ్రమలో కలిపిన తమ భూమికి పరిహారం లేదా ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఐటీసీ గేటు వద్ద టెంటు వేసి నిరసనకు దిగారు. హైకోర్టు తమకే అనుకూలంగా తీర్పునిచ్చినా యాజమాన్యం స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు.