రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు పల్లెర్ల విద్యార్థులు ఎంపిక
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ఐ హ్యాండ్ బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటారు. విద్యార్థులు తండా రాదేశ్, ప్రణతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. వెంకటనరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు డాక్టర్ జెట్ట రవీందర్ విద్యార్థులను అభినందించారు.