సిద్దిపేట జిల్లా ప్రజా పండుగ వేడుకలు: నేడు ఘనంగా ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ప్రజా పండుగ వేడుకలు కొద్దిసేపట్లో ఘనంగా ప్రారంభంకానున్నట్లు హరీష్ రావు ఆఫీస్ వెల్లడించింది. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రత్యేక వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. పదేళ్ల కాలంలో జిల్లా సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాలు సాగుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి పండుగను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.