దిల్లీలో హైఅలర్ట్: ఆరు మెట్రో స్టేషన్లు బంద్, భారీ ట్రాఫిక్ ఆంక్షలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Delhi

భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని దిల్లీలోని రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా ఆరు మెట్రో స్టేషన్లలో ప్రవేశాలను అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు నిలిపివేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్ని స్టేషన్లలోనూ ఇంటర్ చేంజ్ సదుపాయం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.