ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
ఉగ్రవాదాన్ని పోషిస్తున్న దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పేరు ఎత్తకుండా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సాధారణ విషయంగా మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. స్నేహం, సద్భావన ఉగ్రవాదంతో కలిసిపోవని, దేశాన్ని కాపాడుకునే హక్కు భారత్కు ఉందని జైశంకర్ తేల్చిచెప్పారు.