బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. నాలుగో రోజే చరణ్ ఎలిమినేషన్!

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో రోజే సంచలన పరిణామం చోటుచేసుకుంది. తొలి ఎలిమినేషన్‌లో భాగంగా చరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సొంతంగా ఆట ఆడకుండా ఇతరులపై ఆధారపడుతున్నాడనే కారణంతో మెజారిటీ హౌస్‌మేట్స్ అతనికి వ్యతిరేకంగా ఓటేశారు. ఊహించని విధంగా నాలుగో రోజే ఎలిమినేట్ కావడంతో చరణ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.