ప్రేమలో తీవ్రంగా మోసపోయాను: గ్లామర్ నటి రెజీనా సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తన గత ప్రేమ బంధంలో ఊహించని రీతిలో తీవ్రంగా మోసపోయానని, ఆ అనుభవం తనను మానసికంగా కుంగదీసిందని నటి రెజీనా కసాండ్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత జీవితంపై స్పందించిన ఆమె, ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని వెల్లడించారు. ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు బాధితులు ఆత్మన్యూనతకు గురికాకుండా ధైర్యంగా బయటపడాలని పిలుపునిచ్చారు.