మహిళను బెదిరించి కోట్లు వసూలు చేసిన న్యాయవాది పరారీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కన్నియాకుమరి
మహిళ ఇంట్లో రహస్య కెమెరా పెట్టి అశ్లీల వీడియోలు తీసి యాభై లక్షల నగదు, నగల వసూలుతో పాటు కోట్ల విలువైన ఆస్తి కోసం బెదిరింపులకు పాల్పడిన న్యాయవాది రెజినాల్డ్, అతని తమ్ముడు శైలేష్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పూదప్పాండి పోలీసులు స్పష్టం చేశారు.