మహిళా అధికారిపై సీనియర్ ఐఏఎస్ వేధింపులు: సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీనగర్

మహిళా జేకేఏఎస్ అధికారిపై సీనియర్ ఐఏఎస్ అధికారి అనుచిత ప్రవర్తనను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఆన్లైన్ సమావేశంలో బెదిరింపులకు పాల్పడిన అధికారి తీరు ఆమోదయోగ్యం కాదని ఆయన మండిపడ్డారు. జూనియర్ అధికారికి ఎలాంటి ప్రతీకార చర్యలు ఎదురుకాకుండా చూస్తామని, ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.