అహల్యానగర్ వృద్ధాశ్రమంలో ఘోరం ఇద్దరు వృద్ధుల దుర్మరణం

రిపోర్టర్: అశోక్ స్థలం: అహల్యానగర్

అహల్యానగర్ లోని విలాద్ ఘాట్ వృద్ధాశ్రమంలో జరిగిన హింసాత్మక దాడిలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారని, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ ముమ్మక సుదర్శన్ తెలిపారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తోటి అంతఃవాసుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై తన ప్రత్యేక మెటల్ స్టిక్ తో ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను తక్షణమే అహల్యానగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.