రూ.1548 కోట్లతో అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి అంటున్న బీజేపీ
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
రాజధాని అమరావతి అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ స్పష్టం చేసింది. రూ.1548 కోట్ల భారీ నిధులతో అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేస్తున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ చర్యల ద్వారా రాజధాని నిర్మాణానికి మరింత బలమైన బాటలు పడుతున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు.