పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం అవస్థలు నేలలో తేమ తగ్గి పంటలపైనా ప్రభావం
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని, నేలలో తేమ తగ్గి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోందని లాంఫామ్ వాతావరణ విభాగ ప్రధాన శాస్త్రవేత్త రత్నం తెలిపారు. సెప్టెంబరులో రికార్డు స్థాయిలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో అన్నదాతలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి, కంది, ఉద్యాన పంటల దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.