ఏపీకి రూ.14 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రవాహం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీకాకుళం
గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలు వచ్చాయని, దీని ద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ 2026 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి మరింత ఉత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.