రాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. మండపాలు, ఇళ్లలో బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు, మంగినపూడితో పాటు పలు ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగినపూడి తీరంలోని మహాగణపతిని తొలిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని, రాత్రి 10 దాటితే లౌడ్ స్పీకర్లు వాడవద్దని పోలీసులు సూచించారు.