తలకొండపల్లిలో తమిళనాడు మంత్రి మతన్రాజా పట్టు పరిశ్రమ పర్యటన
రిపోర్టర్: మహేష్
స్థలం: తలకొండపల్లి
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంటతండా, గట్టుఇప్పలపల్లి గ్రామాల్లో తమిళనాడు రాష్ట్ర మంత్రి పి. మతన్ రాజా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మల్బరి సాగు, పట్టుపురుగుల పెంపకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు పట్టు పరిశ్రమ అధికారులు పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు.