తల్లిదండ్రులపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న ఖమ్మం యువకుడు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరానికి చెందిన పేరబోయిన శ్రీకాంత్ తన తల్లిదండ్రులపై ఉన్న అపారమైన ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నారు. తన రెండు చేతులపై తండ్రి పేరబోయిన మోహన్‌రావు ఫోటోను కామ్రేడ్‌గా, తల్లి ఫోటోను అమ్మగా టాటూలుగా వేయించుకున్నారు. సీపీఐ జిల్లా నాయకుడైన తండ్రిని, కన్నతల్లిని తన చేతులపై శాశ్వతంగా నిలుపుకున్న శ్రీకాంత్ అభిమానం స్థానికంగా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.