అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేళ తోటపల్లిగూడూరు మండలం పేడూరులో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తోటపల్లిగూడూరు
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామం కొలిదిబ్బ ఎస్టీ కాలనీలో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి పద్మశ్రీ మాట్లాడుతూ అక్షరాస్యత ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిషేధ చట్టం, ఉచిత న్యాయ సహాయం గురించి గ్రామస్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటరమణయ్య, తహశీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీవో లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.