మధ్యలో సినిమా నిలిపివేసిన థియేటర్‌కు కన్స్యూమర్ కమిషన్ భారీ జరిమానా
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
సినిమా ప్రదర్శన మధ్యలో నిలిపివేసిన ఘటనలో పీవీఆర్ ఐనాక్స్ థియేటర్‌కు హైదరాబాద్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ రూ.6,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే సాంకేతిక సమస్యలంటూ షోను రద్దు చేయడంపై పీ ప్రశాంత్ అనే వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. దీనిని సేవాలోపంగా పరిగణించిన కమిషన్ రూ.5,000 పరిహారం, రూ.1,000 వ్యాజ్య ఖర్చులు చెల్లించాలని సెప్టెంబర్ 11న తీర్పు వెలువరించింది.