ఏఐ కంపెనీపై ఊర్వశి రౌతేలా ఏడు వేల కోట్ల దావా
రిపోర్టర్: గోపి
స్థలం: Mumbai
తన పేరు, ఫొటోలు, వీడియోలను ఎలాంటి అనుమతి లేకుండా వాడారంటూ లాస్ ఏంజెల్స్‌కు చెందిన కృత్రిమ మేధ సంస్థపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా 7,000 కోట్ల రూపాయల భారీ నష్టపరిహార దావా వేసినట్లు ఆమె బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బాలీవుడ్ ఏఐ సీఈవో షీరాజ్ హసన్ స్పందిస్తూ, ఈ చట్టపరమైన ప్రకటనను కొట్టిపారేశారు.