దివంగత ఐపీఎస్ ఉమేశ్‌చంద్రకు ఘన నివాళులర్పించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్

రిపోర్టర్: కృష్ణ స్థలం: SR Nagar, Hyderabad

దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్ర 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఎస్‌ఆర్ నగర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమేశ్‌చంద్ర చూపిన ధైర్యం, కర్తవ్యనిష్ఠ నేటి పోలీసులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని సజ్జనార్ కొనియాడారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.