ఢిల్లీ మెట్రోలో బాత్రోబ్తో యువతి కలకలం: సోషల్ మీడియాలో వైరల్

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

ఢిల్లీ మెట్రో రైలులో బాత్రోబ్ ధరించి, ముఖానికి ప్యాచెస్ వేసుకుని ప్రయాణించిన ఓ యువతి ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రజా ప్రదేశాలలో ఇలాంటి ప్రవర్తన సరికాదని కొందరు మండిపడుతుండగా, ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని మరికొందరు సమర్థిస్తున్నారు. పబ్లిక్ ఎటికెట్ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్రమైన వాదనలు జరుగుతున్నట్లు ఎక్స్ వేదికగా పలువురు యూజర్లు వెల్లడించారు.