గుర్ల మండలంలో రూ.4.15 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కళావెంకటరావు శంకుస్థాపన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: గరివిడి
గరివిడి మండలంలోని పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గుర్ల మండలంలో నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు గురువారం భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకే రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.