నెల జీతం లక్ష కంటే తక్కువైతే బెంగళూరుకు రావద్దంటూ టెకీ సంచలనం
రిపోర్టర్: సతీష్
స్థలం: బెంగళూరు
నెలవారీ వేతం లక్ష రూపాయల కంటే తక్కువ ఉంటే బెంగళూరు నగరానికి రావద్దని ప్రముఖ టెకీ, కంటెంట్ క్రియేటర్ శివాంక్ గోయెల్ స్పష్టం చేశారు. నగరంలో పెరుగుతున్న జీవన వ్యయం, విపరీతమైన వాణిజ్యీకరణ కారణంగా పన్నెండు లక్షల వార్షిక వేతం కూడా కేవలం నాలుగు లక్షల రూపాయల మాదిరిగానే మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న వినోదానికి, అభిరుచికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని, రవాణా మరియు అద్దెలు భారంగా మారాయని ఆయన తెలిపారు.