జ్యోతినగర్లో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఏసీపీ

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రం జ్యోతినగర్ లోని గణేష్ మండపం వద్ద శ్రీ లక్ష్మి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం రోజున హుస్నాబాద్ ఏసీపీ సదానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గణేశ్ మండపాల వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని, చివరి రోజున గణపతులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జనం జరుపుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.